Wednesday, 4 November 2026

తండాలను ముంచేత్తుతున్న కల్తీ కళ్ళు.

తండాలను ముంచేత్తుతున్న కల్తీ కళ్ళు. రెండు రోజులు మత్తు కళ్ళు తాగకుంటే తల తిరిగి పడిపోతున్న జనం * లేవని కాళ్ళ మొఖాల్లు * మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు

జనం సాక్షి /కొల్చారం మండలం కల్తీకల్లు విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఆధునిక యుగానికి దూరంగా ఉంటూ అటవీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న గిరిజన తండాల్లోకి కల్తీ కళ్ళును చొప్పించి వారి ఆరోగ్యంతో చెలగాటం మారుతున్నారు. గిరిజనులకు మత్తు కల్లుకు అలవాటు చేయడంతో ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి భయంకరంగా తయారైంది. రెండు రోజులు మత్తు కళ్ళు తాగకుండా తల తిరిగి కింద పడిపోవడం ఇక్కడ పరిపాటిగా తయారైంది. మోకాళ్ళ నొప్పులు సైతం భరింపరానివుగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లి, వేల రూపాయలు వెచ్చించి మందులు వాడిన మత్తు కళ్ళు ప్రభావం మాత్రం శరీరంలో తగ్గడం లేదు. అడవిలో ఉండే గిరిజన లు బలిష్టంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే…. కానీ ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎందుకు భిన్నంగా తయారైంది. మత్తు ప్రభావంతో శరీరంలో పనిచేసే తత్వం తగి నరకయాతన అనుభవిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓవైపు మత్తు కళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడం లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయవలసిన ఎక్సైజ్ అధికారులు కల్లు డిపోల వారు ఇచ్చే మామూళ్ల మత్తులో మునుగుతుండడం గిరిజనుల పాలిట శాపంగా మారింది. గిరిజన తండాలో మత్తు కళ్ళు నియంత్రణ చేయకుంటే మరిన్ని ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సింది వస్తుంది. గిరిజన తండాలో దుకాణాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేకున్నా, కళ్ళు విక్రయాలు జరపడం అధికారుల అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది అన్నది తండాల్లోని చదువుకుంటున్న వారు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం స్పందిస్తారో వేచి చూడాలి.