జగిత్యాల 12, మే 2023:శ్రీ హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను పురస్కరించుకొని కొండగట్టులో శుక్రవారం
హన్‌మాన్ జయంతి శోభయాత్ర వై జంక్ష్ నుండి స్వామి వారి ఆలయం వరకు కన్నుల పండుగగా సాగింది.
చొప్పదండి శాసన సభ్యులు శ్రీ సుంకె రవి శంకర్ కొండగట్టు వై జంక్షన్ వద్ద శోభయాత్ర ను ప్రారంభించారు.
వేలాది మంది హన్‌మాన్ భక్తులు జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో శోభయాత్రలో నినదించారు. అధ్యాత్మిక ఉట్టి పడేలా తమ కళా రూపాలను కళాకారులు శోభాయాత్ర లో ప్రదర్శించారు.
భద్రాచలం నుంచి వచ్చిన తలంబ్రాలు,పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారికి సమర్పించారు.
కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వణాధికారి వెంకటేశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీ హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను పురస్కరించుకొని కొండగట్టులో శుక్రవారం నుండి మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఆధ్యాత్మిక ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి.
————————
జిల్లా పౌర సంబంధాల అధికారి,జగిత్యాల గారిచే జారీ చేయనైనది




