Thursday, 5 November 2026

కొండమల్లేపల్లి ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సంపెంగల సురేందర్ మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు

కొండమల్లేపల్లి ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సంపెంగల సురేందర్ మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు ప్రజాప్రతినిధులు కొండమల్లేపల్లి జనవరి 13 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్, సీనియర్ ఫోటోగ్రాఫర్, మున్నూరు కాపు నల్గొండ జిల్లా కోశాధికారి సంపెంగల సురేందర్ అకస్మాత్తుగా మృతి చెందడం ఎంతో బాధాకరమని, కొండమల్లేపల్లి మండలంలో గత 15 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేస్తూ ఉన్నారు 20 సంవత్సరాలు నుండి ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉన్నారు అనారోగ్యంతో మృతి చెందిన సంపెంగల సురేందర్ దేవరకొండ కొండమల్లేపల్లి మండల కేంద్రాలలో అందరికి పరిచయం ఉన్న వ్యక్తి మంచికి మారుపేరుగా నిలిచి కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అనురాగం, ఆప్యాయత, ప్రేమానురాగాలతో ఏ క్షణంలోనైనా నేనున్నానంటూ ముందుండి సమస్యను వెలుగు తీసిన మిత్రుడు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సురేందర్ మరణ వార్తను చాలా బాధాకరం అని, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా ప్రజల సమస్యలపై చాలా విలువైన సమాచారం రాసేవారని అలాంటి వ్యక్తి దుర్మణం చెందడం ఎంతో బాధాకరమని, సంపెంగల సురేందర్ ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మన ధైర్యాన్ని ప్రసాదించాలని సంపెంగల సురేందర్ మృతి పట్ల కొండమల్లేపల్లి ప్రెస్ క్లబ్ అసోసియేషన్, సంతాపం తెలియజేశారు మరియ కొండమల్లేపల్లి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సంపెంగల సురేందర్ మృతి విషయం తెలుసుకున్న దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యే నేను బాలు నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేతావత్ బిల్య నాయక్ లు విచారం వ్యక్తం చేస్తూ సురేందర్ మృతి చాలా బాధాకరమని తెలిపారు మరియు సంపెంగల సురేందర్ మృతి పట్ల కొండమల్లేపల్లి సిఐ రవీందర్, ఎస్ఐ నారాయణరెడ్డి, ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, జడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ కొండమల్లేపల్లి సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ , జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షులు కేసాని లింగారెడ్డి ఉప సర్పంచ్ గంధం సురేష్,, మేకల శ్రీనివాస్ యాదవ్, గుండెబోయిన లింగం యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు