Thursday, 5 November 2026

కోరుట్ల నియోజకవర్గ స్థాయి హత్ సే హాత్ జోడో

కోరుట్ల నియోజకవర్గ స్థాయి హత్ సే హాత్ జోడో అభియాన్ సమీక్ష సమావేశం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు
కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమె
అసత్య ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దు
ఎసిడి బిల్లులకు నిరసనగా పోస్టల్ ఉద్యమం
మెట్పల్లి టౌన్, జనవరి 13,
జనంసాక్షి :
మెటుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో జోడో అభియాన్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ ప్రతి గ్రామ గ్రామానికి జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహిచాలని అన్నారు.నియోజకవర్గంలో ప్రతి మండల అధ్యక్షులు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు బూత్ లెవల్ నాయకులు అందరు కూడా జనవరి 26 నుండి మొదలు కానున్న అభియాన్ కార్యక్రమంలో పాల్గొని బిజెపి. బి ఆర్ ఎస్ యొక్క దుర్మార్గపు పాలన గురించి గ్రామ గ్రామలో వివరించాలని అని అన్నారు.రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోయిoది అని డబుల్ బెడ్ రూమ్. ఉచిత విద్య. నిరుద్యోగ భృతి. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వైపల్యాలను ప్రజలకు అర్థం అయ్యే విధంగా గ్రామ గ్రామన వివరించాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు.నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నిజమైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందడం లేదని అన్నారు.కేంద్ర ప్రభుత్వం డీజిల్. పెట్రోల్ మరియు గ్యాస్ రెట్లను పెంచి పెద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుంది అని జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు.అదేవిధంగా తెరాస పాలన కేవలం ప్రకటనలకు.శిలఫలాకల మీద తప్ప అభివృద్ధి లేదు అన్నారు.అదే విధంగా ఎలక్ట్రిసిటీ శాఖ మీటర్ మీద 1000నుండి 2000 వరకు డిపాజిట్ వసూలు చేయడం సరి కాదు అన్నారు. దీని నిరసనగా పోస్టల్ ఉద్యమం మొదలు పెట్టాం అని జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు. అదే విధంగా టీవీ చానెల్ లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు అని అన్నారు. నేను కార్యకర్తల వెంట ఉంటా అని, ఎప్పడు అయిన మీ నిర్ణయం మే నా నిర్ణయం అని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు.ఈ కార్యక్రమంలో.టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు .బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి.పెరుమాండ్ల సత్యనారాయణ గౌడ్ సీనియర్ నాయకులు కొంరెడ్డి లింగారెడ్డి మెటుపల్లి పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం మండల అధ్యక్షుడు అంజిరెడ్డి. కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్. ఇల్లెందుల రాజు, కోరుట్ల నియోజకవర్గంలోని పట్టణాల, గ్రామాల కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ శాఖల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..