కొండమల్లేపల్లి జనవరి 30 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం నాడు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ 75 వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం అహింసను ఆయుధాలుగా, శాంతి యుతంగా స్వాతంత్ర సంగ్రామం చేసిన భారత జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్థంతి సందర్భంగా మండల కేంద్రములో చౌరస్తా లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు శాంతి అహింస సత్యము అనే మార్గంలో భారత దేశంకు స్వాతంత్రము సిద్దింప చేసిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు. కులమత భేదం లేకుండా అందరూ సమానమే అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి బాపూజీ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వూరే జనార్దన్, చందా ధనుంజయ, గౌరు వెంకటేశ్వర్లు, కామిశెట్టి నరేందర్, పంపాటి శ్రీధర్, దొడ్డి మధు, నీలా లక్ష్మయ్య, రాజమళ్ళ నరసింహ, సముద్రాల కిరణ్, తేరటిపల్లి బుచ్చి రాములు, మంచికంటి జగన్మోహన్, పేర్వాల నరేందర్, రమేష్, బూరుగు శ్రీకాంత్, నీలా విజయ్ కుమార్ కామిశెట్టి హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు




