కొండమల్లేపల్లి జనవరి 26 (జనంసాక్షి )న్యూస్ :కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంపీడీవో బాలరాజు రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధి గా ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి పాల్గొని మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన, దళిత, గిరిజన వర్గాలకు ఎన్నో హక్కులు, విద్యా, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో కల్పించిన రిజర్వేషన్లకు, రక్షణలకు రూపం ఇచ్చిన రోజు కావడం వల్ల ఇది మనకు గొప్ప జాతీయ పండగ అని అన్నారు గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.ఈ రోజు భారతీయులందరీకి ఎంతో ప్రత్యేకం. భారతదేశం అంతా దీన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం మాతృభూమి కోసం.. తమ ధన, మాన ప్రాణాలను.. త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు.. వందనం.. అభివందనం.. పాదాభివందనం అని మండల ప్రజలకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, జడ్పీటీసీ సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది మరియు మండల ముఖ్య అధికారులు, సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు




