కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ (యూపీఏ) చైర్ పర్సన్ సోనియాగాంధీ శుక్రవారం నాడు 76వ పడిలోకి అడుగు పెట్టారు సోనియా గాంధీ జన్మదిన శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సోనియాగాంధీ మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గౌరవించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రజా క్షేత్రంలో ఆమె విలువైన సేవలు ప్రజలకు అందించాలని ఆకాంక్షిస్తూ రాబోయే సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ తల్లి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు అనంతరం సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేకులు కట్ చేసి ప్రజలకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు వేమన్ రెడ్డి ,వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు ,వర్కింగ్ ప్రెసిడెంట్ బొడ్డుపల్లి సైదులు,ఎంపీటీసీలు జగన్ నాయక్,రాణి రాజు నాయక్, రవి నాయక్,బక్కులు నాగరాజు నాయక్, మంగ్య నాయక్ ,ఏకుల సురేష్ , ఎండి ఖదీర్, రమవత్ సేవ నాయక్ ,మహేందర్ ,కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.