Tuesday, 3 November 2026

కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజల

కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు ఆర్టీసీ సేవలు స్థానిక సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ కొండమల్లేపల్లి నవంబర్ 29 జనం సాక్షి న్యూస్: కొండమల్లేపల్లి మండలం కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో “ప్రజల వద్దకు ఆర్టీసీ” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్టీసీ డిపో మేనేజర్ రాజీవ్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఆర్టీసీ అందిస్తున్న సేవలను వివరించారు.ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమకరంమని అన్నారు.ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని,ఆదరించి బస్సుల్లోనే ప్రయాణించేలా అవగాహన పెంచుకోవాలని కోరారు. విద్యార్థులకు,దివ్యాంగులకు పాసుల ద్వారా ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది జబ్బు వెంకటయ్య,డి ఎస్ రెడ్డి,స్థానికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.