Tuesday, 3 November 2026

గ్రేటు సూపర్వైజర్ గా ఆర్డర్

గ్రేటు సూపర్వైజర్ గా ఆర్డర్
కాపీ అందుకున్న జలగం సునీత
పెద్దవంగర నవంబర్ 29(జనం సాక్షి )పెద్దవంగర మండల చిన్నవంగర గ్రామానికి చెందిన జలగం సునీత గత కొద్ది సంవత్సరాల నుండి అంగన్వాడి టీచర్ గా సేవలందిస్తున్నారు ఇటీవల గ్రేడ్ సూపర్వైజర్ గా ప్రమోషన్ పొందారు దీనికి గాను మహబూబాబాద్ ఐసిడిఎస్-డి డబ్ల్యు ఓ అధికారి చేతుల మీదుగా ఆర్డర్ కాపీని అందుకుంది. ఈ సందర్భంగా జలగం సునీత నీ వివరణ కోరగా అంగన్వాడి టీచర్ గా గత కొద్ది సంవత్సరాలుగా పిల్లలకు సేవ చేస్తున్నానని,చేసిన సేవనే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకు వచ్చిందని, పిల్లలకు చేసిన సేవ వృధా కాలేదని మనం చేసే ఏసేవైనా భవిష్యత్తులో అత్యంత ఉన్నత స్థాయిలో ఉంచుతుందని నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని, బాధ్యత కూడా పెరిగిందని, అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అత్యంత బాధ్యతగా నెరవేస్తానని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాకు సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రజలు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని దీవిస్తూ ప్రశంసలు కురిపించారుచారు.