Tuesday, 3 November 2026

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్పాహార ఏర్పాట్లు చేపించిన ఎంపీపీ

 

 

 

 

దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 30 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం అల్పాహార ఏర్పాట్లు చేపించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులందరూ ఒత్తిడి అధిగమించి మానసికంగా, శారీరకంగా సన్నద్ధమై పరీక్షలు రాయాలని అందరూ మంచి ఉత్తీర్ణత సాధించాలని మీరు చదువుకునే పాఠశాలకు మీకు జన్మనిచ్చి తల్లిదండ్రులకు విద్యాభ్యాసం నేర్పిన గురువులకు సమాజానికి దేశానికి ఉపయోగపడేలా గొప్పగా ఎదగాలని సూచించారు విద్యార్థులందరూ క్రమశిక్షణ సమయ భావన తోటి విద్యార్థులతో స్నేహభావంగా ఉండాలని తెలిపారు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 286 మంది విద్యార్థులు ఐదు సెక్షన్లతో పదవ తరగతి చదువుతున్నారని విద్యార్థులందరికీ సాయంత్రం సమయంలో అల్పాహారం ఏర్పాటు చేసి బాధ్యత మేము తీసుకుంటామని ప్రతిరోజు వేర్వేరు ఐటమ్స్ స్నాక్స్ ఏర్పాట్లు చేపిస్తామని విద్యార్థులు అందరూ 100% ఉత్తీర్ణత శాతం సాధించాలని అధ్యాపకులు అందరూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ, చేరుపల్లి శ్రీనివాస్, కొర్ర లోక్య నాయక్, సముద్రాల శ్రీనయ్య, అక్కిరెడ్డి, కె. వెంకటేశ్వర్లు, దేవకుమార్, సూర్య, ఈదయ్య గౌడ్, నల్లా నరసింహ, ఉమామహేశ్వరి, సీతారాం, నాగరాజు, గిరి, సీనయ్య, పీజే నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు