Tuesday, 3 November 2026

తెనుగొళ్ళ జాతి ఔన్నత్యాన్ని చాటాలి.

 

 

 

 

–తెనుగొళ్ళ జాతి ఔన్నత్యాన్ని చాటాలి.-డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్.-తాడూరు మండల కేంద్రంలో జిల్లా తెనుగోళ్ళ భవన సాధన కమిటీ సమావేశం.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జనవరి30(జనంసాక్షి):తెనుగు కులంలో పుట్టిన ప్రతి బిడ్డ తెనుగొళ్ళ జాతి ఔన్నత్యాన్ని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెనుగొళ్ళ జిల్లా భవన సాధన కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ పిలుపునిచ్చారు. సోమవారం తాడూరు మండల కేంద్రంలో నిర్వహించిన తెనుగొళ్ళు జిల్లా భవన సాధన కమిటీ సమావేశంలో ఎంపీటీసీ మల్లయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యార రమేష్, అడ్వకేట్ గొర్ల శ్రీనివాస్, మత్స్య సహకార సంఘం నాగర్ కర్నూల్ మండల అధ్యక్షుడు గూల్ల హరికృష్ణలతో పాటు కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో అత్యధికంగా ఉన్న తెనుగు కులం ఆర్థిక, సామాజిక, విద్యా రంగాలలో వెనుక బాటుతనాన్ని కలిగి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెనుగొళ్ళ జిల్లా భవనం నిర్మించు కునేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఈ భవన నిర్మాణానికి ప్రతి తెనుగు బిడ్డ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా తెనుగొళ్ళ జాతి అంతా ఒక్కటై ఐక్యమత్యంగా అన్ని రంగాల్లో చైతన్య వంతం కావలసిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యాపరంగా ముందున్నప్పుడే మన జాతి అభివృద్ధి అవుతుందని తెలిపారు.మన పెద్దలు తెనుగు జాతికి కొన్ని విలువలు సాంప్రదాయాలను నేర్పి పోయారని ఆ విలువలను సాంప్రదాయా లను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి తెనుగు బిడ్డ పై ఉందని గుర్తు చేశారు. తెనుగు జాతి అంటే మాట తప్పని మడమ తిప్పని జాతి అని,ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.ఉమ్మడి జిల్లాలో తెనుగొళ్ళ కొరకు అహర్నిశలు శ్రమించిన పండుగోళ్ల సాయన్న లాంటి పోరాట యోధుడిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే తెనుగొళ్ళ భవన సాధన కమిటీని వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సందు యాదగిరి,గొడుగు సహదేవుడు,యానమోని తిరుపతయ్య, గూళ్ళ చెన్నకేశవులు,ఎర్రమోని శివయ్య, దర్నమోని పరమేశ్వర్,కురుమూర్తి,తాడుర్ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు శంకర్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శి లు తదితరులు పాల్గొన్నారు