కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు మందా సత్యనారాయణ కొండమల్లేపల్లి నవంబర్ 14 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలోని సోమవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను విద్యార్థినీ విద్యార్థులు మరియు అధ్యాపక బృందం సమక్షంలో ఘనంగా జరిపారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత మొట్టమొదటి ప్రధాన మంత్రి, జవహర్ లాల్ నెహ్రూ అని తెలిపారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇంగ్లాండ్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో న్యాయ శాస్త్రంలో బారిష్టర్ పూర్తిచేసి స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన మహా గొప్ప స్వాతంత్ర వాది అని తెలిపారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలు అంటే అమిత ప్రేమ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న జరుపుకునే బాలల దినోత్సవాన్ని బాల్ దివస్ అని కూడా అంటారు బాలల హక్కులు, సంరక్షణ విద్యపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా నవంబర్14న బాలల దినోత్సవం జరుపుకుంటారు తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం బహుమతి పిల్లలు అని, పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయత అమితమైందని జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్తారు జవహర్ లాల్ నెహ్రూ గారి మరోపేరే చాచా నెహ్రు అని పిలుస్తారు చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆట పోటీలు నిర్వహించారు ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఆధ్యాత్మిక బృందానికి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాసులు, కొర్ర లోక్యా నాయక్, ఎబిలైజర్ జనార్దన్ రెడ్డి నల్ల నర్సింహ శ్రీపతిరావు సరస్వతి సౌజన్య నాగేంద్రమ్మ అక్కిరెడ్డి హజార్ అలీ వెంకటేశ్వర్లు చంద్రయ్య జగదీష్ కవిత నర్సింహారావు నహీదా షమీం సూర్య సీతారాం నాగరాజు సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు
కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ




