Tuesday, 3 November 2026

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ కొండమల్లేపల్లి జనవరి 3 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరిగాయాని ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి దండలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశంలో విద్యా రాణిగా మొదటి ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎదిగి భారత విద్యా రంగ చరిత్రలో నిలిచారన్నారు. భారత దేశ ఆనాటి సామాజిక వ్యవస్థలైన వర్ణ వ్యవస్థలో అణచివేత, అవమానం, మహిళల దాష్టికం నుండి చైతన్యవంతమైన విద్యా దీప్తిగా ఎదిగి నేటి ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు, విద్యార్థినీ విద్యార్థులకు ఆదర్శవంతమయ్యారన్నారు దేశ ప్రగతికి ఎన్నో సంస్కరణలు విద్య ద్వారానే మహిళ సాధికారత సాధించవచ్చు అని భావించి బలహీన బడుగు వర్గాల బ్రతుకుల్లో వెలుగు నింపటానికి పాఠశాలను ప్రారంభించి విద్యా దివ్వెలను అందించి దేశానికి వారు సేవలు అందించారన్నారు. వారి ఆదర్శవంతమైన కుటుంబ జీవితం భారతదేశం మహిళా సాధికారత, సాధించుటలో ముందడుగు వేసిందని అని చెప్పవచ్చు అని, ప్రతి విద్యార్థిని చదువులో ముందుండి ఎన్ని ఆటంకాలు వచ్చినా చదివి ఎదగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చెరుపల్లి శ్రీనివాసులు సముద్రాల శీనయ్య కొర్ర లోక్యానాయక్ చంద్రయ్య జగదీష్ రెడ్డి జనార్దన్ రెడ్డి శ్రీపతిరావు వెంకటేశ్వర్లు నీరజ కలమ్మ ఉమామహేశ్వరి అక్కిరెడ్డి ఈదయ అశోక్ కుమార్ దేవకుమార్ నల్లా నరసింహ అజాహర్ సూర్య లింగారెడ్డి నరసింహ చారిసీతారాం పీజే నర్సింహారావు నాగరాజు సరస్వతి నహిద సమీం నిర్మల తదితరులు పాల్గొన్నారు