చదువుల తల్లి సావిత్రిబాయి పులే జీవితం స్ఫూర్తిదాయకం.
విద్యార్థి సంఘం నాయకులు పోకల సాయికుమార్.
జడ్.పి.హెచ్.ఎస్ గీతానగర్లో మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే విగ్ర ఆవిష్కరణ.
రాజన్న సిరిసిల్ల బ్యూరో జనవరి 3.(జనంసాక్షి). తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా విద్యా ప్రాధాన్యతను గుర్తించిన సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకమని విద్యార్థి సంఘం నాయకులు పోకల సాయికుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని గీత నగర్ జెడ్ పి హెచ్ ఎస్ లో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యార్థి సంఘం నాయకులు పోకల సాయికుమార్ విగ్రహాన్ని అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు సాయికుమార్ తో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చదువు అవసరాన్ని మొదటగా గుర్తించిన మహాత్మ జ్యోతిరావు పూలే విద్యను అందరికీ చేరువ చేసేందుకు తన జీవితమంతా కృషి చేశారని తెలిపారు. మహిళ ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే విద్య వ్యాప్తి కోసం అందించిన సేవలు మరువలేని అన్నారు. వారి జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధా కిషన్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు భూపాల్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ వెల్దండి దేవదాస్, పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు




