దేవుళ్లను అవమానించిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు…
– పవార్ రామారావు పటేల్.
భైంసా రూరల్ జనవరి 03 జనం సాక్షి
హిందూ దేవతమూర్తులను అవమానించిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే బిజెపి నాయకులు రామారావు పటేల్ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్.ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు… గతకొన్ని రోజుల నుండి హిందూ దేవీ, దేవతలను ఇష్టమొచ్చినట్లుగా వ్యంగ్యంగా మాట్లాడుతున్న వ్యక్తుల పట్ల, ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబించడం లేదని మొన్న ఎమ్మెల్యే రాజాసింగ్, అంతకుముందు స్వామి పరిపూర్ణానంద గారికి నగర బహిష్కరణ చేశారని… మరి ఇప్పుడు ఈ దుర్మార్గులను ఏం చేస్తారని అన్నారు. ఈ దుర్మార్గులు మీ టిఆర్ఎస్ కార్యకర్తల…మీ ఉద్దేశం కులాల్ని, మతాల్ని , విభజించడమా..?ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీలా కులాలని, మతాలని, అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే పార్టీ కాదన్నారు. ఇకనైనా టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ దుర్మార్గులను వెంటనే శిక్షించాలని లేకపోతే రాబోయే రోజుల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో నాయకులు
రవి పాండే (అడ్వకేట్),గోపాల్ సార్డ, దశరథ్ (కౌన్సిలర్),అబ్దుల్ రజాక్ (ఎం.పి.టి.సి),
బాలాజీ సుత్రవే (మాజీ భాజపా పట్టణ అధ్యక్షులు),ఓల గజ్జరాం (మాజీ సర్పంచ్),
శ్రీనివాస్,తూముల దత్తు,దిగాంబర్, సుమిత్, హన్మండ్లు,చందు,సందీప్ పాటిల్,విజయ్,రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.




