కొండమల్లేపల్లి ఫిబ్రవరి 9 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి నూతన ఎస్ఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన వీరబాబును కొండమల్లేపల్లి వైసీపీ కాసర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొండమల్లేపల్లి పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయని హద్దు అదుపు లేకుండా బెల్ట్ షాపులు అడ్డగోలుగా నిర్వహిస్తున్నారని ముసలి యువత అనే సంబంధం లేకుండా విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారని పాఠశాలలు దేవాలయాల ప్రాంగణాలలో కూడా మద్యం సేవించి సీసాలు పడేస్తున్నారని బెల్ట్ షాపులపై దృష్టి సారించి యువతను తప్పుదారిన పడకుండా కాపాడాలని, పట్టణంలోని రెస్టారెంట్లు హోటల్లు బేకరీలు లలో నాణ్యత లోపించిందని, కిరాణా షాపులు బట్టల షాపులలో ధరల పట్టికను గమనించాలని నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ వీరబాబును విన్నవించుకున్నారు కొండమల్లేపల్లి పట్టణంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉందని రోడ్లకు ఇరువైపులా వాహనదారులకు ఇబ్బందిగా చిరు వ్యాపారస్తులు రోడ్లపైనే వ్యాపారాలు చేస్తున్నారని దయచేసి వాహనదారులకు ట్రాఫిక్ సమస్య రాకుండా నివారించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజు, ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు మంగ్యా నాయక్, యేకుల సురేష్ కుమార్, చేపూరి కార్తీక్, పసునూరి అశోక్, ఎండి ఖదీర్, పెద్దిశెట్టి మహేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు




