Wednesday, 4 November 2026

విద్యుత్ కోతలపై ఎన్డీ (ప్రజాపందా) సబ్ స్టేషన్ ముందు ధర్నా

 

 

 

 

 

 

* విద్యుత్తు కోతలను ఎత్తివేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పందా డిమాండ్టేకులపల్లి, ఫిబ్రవరి 9( జనం సాక్షి ): సిపిఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం టేకులపల్లి సబ్ స్టేషన్ ముందు సిపిఐ ఎంఎల్ ప్రజాపందా మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతులను ఎత్తివేయాలని ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ధర్నా ను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ ప్రజాపందా జిల్లా నాయకులు డి ప్రసాద్, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా మండల కార్యదర్శి ధర్మపురి వీరబ్రహ్మ చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తున్నమని ప్రచారం చేసుకుంటూ 24 గంటలు కరెంటు కటింగ్ ఇస్తున్నారని ఎద్దేవ చేశారు. విద్యుత్తు కోతల వలన రైతాంగం, ఇతర కుటీర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం వరి,మొక్కజొన్న, మిర్చి తోటలకు నీరును కట్టుకోవాలంటే కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నదని అన్నారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజలకు అదనంగా విధించిన ఎసిడి బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారని దాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఏ సి డి పేరుతో వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా మండల నాయకులు జరుపుల సుందర్, భూక్య పంతులు, భూక్య లాల్య, బానోతు లింగ, ఈసం రామస్వామి తదితరులు పాల్గొన్నారు.