కు ప్రతిపాదనలు పంపి ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్న దేవరకొండ డిఎస్పి నాగేశ్వర్ రావు కొండమల్లేపల్లి మండల కేంద్రంగా ఏర్పాటు కావడంతో ఏర్పాటు అయిన పోలీస్ స్టేషన్ సొంత భవనం లేక పోలీసులు మండల ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ భూమిలోనే నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఏర్పాటు నిమిత్తం గురువారం మండల కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల 107 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని దేవరకొండ డిఎస్పి నాగేశ్వర్ రావు తో కలిసి కొండమల్లేపల్లి తహసీల్దార్ మహేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 107 సర్వే నెంబర్ లోని 12.18ఎకరాల భూమిని గుర్తించి హద్దు రాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 107 సర్వే నెంబర్ లో రెండు ఎకరాలను పోలీస్ ఏర్పాటు నిమిత్తం కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని తెలిపారు కాగా గతంలో ఈ సర్వే నెంబర్ లోని భూమిలో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు అయ్యాయని, ఇకపై ఈ ప్రభుత్వ భూమి విషయంలో జోక్యం చేసుకోరాదన్నారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి సీఐ రవీందర్, ఎస్ఐ నారాయణరెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి సర్వేయర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు




