Wednesday, 4 November 2026

కొండమల్లేపల్లి పట్టణంలో నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టా కార్యక్రమాలకు పట్టణ పుర ప్రముఖుల సమక్షంలో అంగీకారం

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 8 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలో బుధవారం నాడు పుర ప్రముఖుల సమక్షంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న (బొడ్రాయి) నాభిశిల ప్రతిష్టా కార్యక్రమం ప్రజలందరి సమక్షంలో నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టా కార్యక్రమం తేదీని ప్రకటించారు శ్రీ శ్రీ శ్రీ యోగి వేమన, శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరాయ, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున మఠం పీఠాధిపతులు శ్రీ రామాంజనేయ గురు స్వామి ల ఆధ్వర్యంలో తేదీ 15:05:2023 నుండి17: 05:2023 వరకు మూడు రోజుల వరకు కొండమల్లేపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయని కొండమల్లేపల్లి పట్టణ ప్రజలందరి సమక్షంలో ప్రకటించారు ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు నాభిశిల ప్రతిష్టా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనే విషయంపై శ్రీరామాంజనేయ గురుస్వామి వారు త్వరలో మళ్లీ ప్రకటిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల గణపతి శర్మ, పాల సదా శివ శర్మ, డేరం జయప్రకాష్ శర్మ, శివప్రసాద్ శర్మ, కుంభం శ్రీనివాస్ గౌడ్, గంధం సురేష్, నాయిని మాధవరెడ్డి, కేసాని లింగారెడ్డి, పసునూరు యుగేందర్ రెడ్డి, ఉట్కూరి వేమన్ రెడ్డి, బొడ్డుపల్లి శంకర్, నీలా లక్ష్మయ్య, పొగాకు నరేందర్, బోడిగె సాంబశివ గౌడ్, బోడిగె బాలరాజు గౌడ్, బోడిగె శంకర్ గౌడ్, అందుగుల ముత్యాలు, పెద్దిశెట్టి సత్యనారాయణ, ముడావత్ పాండు నాయక్, తోటపల్లి శ్రీనివాస్, వరికుప్పల శ్రీనివాస్, ముడిగ శేఖర్ యాదవ్, బూడిద వెంకటయ్య యాదవ్, బూడిద రమేష్ యాదవ్, రావుల వెంకటయ్య, రావుల సత్యనారాయణ పట్టణ వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామపుర ప్రముఖులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు