Wednesday, 4 November 2026

ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

 

 

 

 

– ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ హుజూర్ నగర్ ఫిబ్రవరి 8 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని అంజలిపురంలో సర్పంచ్ రామనర్సమ్మ అధ్యక్షతన హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది. బుధవారం ఈ సందర్భంగా ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వార్డుల వారీగా చేపట్టి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి అవసరం అగు కళ్లద్దాలు పంపిణీ చేసి ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్విని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఎంపీ ఓ షేక్ మౌలానా, గ్రామ కార్యదర్శి నరేష్, గోలి శ్రీనివాసరావు, కొప్పుల నారాయణరెడ్డి, గొర్రె సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.