ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి.08.(జనంసాక్షి). రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సరైన నిధులు కేటాయించకుండా విద్యారంగాన్ని విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యారంగం పట్ల పట్టింపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 45 లక్షల కోట్ల బడ్జెట్లో విద్య రంగానికి ఒకటి పాయింట్ 12 లక్షల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల 90 కోట్ల బడ్జెట్ లో విద్యా రంగానికి 19 వేల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందని తెలిపారు. విద్య రంగానికి కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవని మండిపడ్డారు. ప్రభుత్వాలు పునరాలోచించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, జూలపల్లి మనోజ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.




