Wednesday, 4 November 2026

కొండమల్లేపల్లి పట్టణంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 20 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో గురువారం నాడు టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కోట్ల జగదీష్, టిడిపి రాష్ట్ర నాయకుడు వస్కుల కృష్ణయ్య మరియు పట్టణ సీనియర్ నాయకుడు బోడో కుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవ వేడుకలు చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని హైదరాబాద్ లో సైబరాబాద్ లాంటి గొప్ప నగరాన్ని తక్కువ సమయంలో నిర్మించి హైదరాబాద్ ని ఐటీ హబ్ గా తయారుచేసి వేల లక్షల మందికి ఉద్యోగ అవకాసం కల్పించాలని అంతర్జాతీయ వేదికలలో హైదరాబాద్ గొప్పతనాన్ని చాటారని చంద్రబాబు నాయుడు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడని వారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రానికి వారు చేసిన సేవల గురించి కొనియాడారు అనంతరం బోడ కుమార్ యాదవ్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు బ్రిటన్ ఐరోపా అమెరికా ఆస్ట్రేలియా రష్యా సౌదీ సింగపూర్ దుబాయ్ దేశాలలో ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారి విలువైన సేవలు ప్రజలకు అందించాలని తెలిపారు అనంతరం చౌరస్తాలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు పట్టణంలో పార్టీలకు అతీతంగా టిడిపి అనే యూనివర్సిటీలో కొన్ని వేల మందికి రాజకీయ నాయకులుగా తయారు చేసిన గొప్ప మహనీయుడని పట్టణంలో ప్రముఖులు ప్రజా ప్రతినిధులు వ్యాపారవేత్తలు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇస్లావత్ సురేష్ సుకారపు శ్రీను కుంభం శ్రీను గౌడ్ నేలపట్ల గిరి వెంకటేశ్వర్లు నగేష్ రాము తదితరులు పాల్గొన్నారు