Wednesday, 4 November 2026

కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ లో ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

సిఐ రవీందర్, ఎస్ఐ నారాయణరెడ్డి కొండమల్లేపల్లి జనవరి 26 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ లో గురువారం నాడు సిఐ రవీందర్, ఎస్ఐ నారాయణరెడ్డి ల ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా సిఐ రవీందర్ జాతీయ జెండా ఎగరవేశారు అనంతరం సిఐ రవీందర్ మాట్లాడుతూ
జనవరి 26వ తేదీ.. మనకు ప్రత్యేకమైన రోజు. భారతదేశం గర్వించదగ్గ రోజు. 1950వ సంవత్సరం జనవరి 26న భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చిన రోజు. దీన్ని పురస్కరించుకునే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మనకు 74వ గణతంత్ర దినోత్సవం. అనేక మార్పులు చేర్పులు తర్వాత అప్పటి మన నాయకులు జనవరి 26వ తేదీన రాజ్యాంగంలోని హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు.
ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, రాజ్యాంగం హక్కులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవటానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అధ్యక్షతన రాజ్యాంగ మార్పులు జరిగి, 1950, జనవరి 26వ తేదీ అధికారికంగా అమల్లోకి తెచ్చారు. ఫలితంగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.ఈ రోజు భారతీయులందరీకి ఎంతో ప్రత్యేకం. భారతదేశం అంతా దీన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటాం
మాతృభూమి కోసం.. తమ ధన, మాన ప్రాణాలను.. త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు.. వందనం.. అభివందనం.. పాదాభివందనం మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం.. భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం.
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ..నేటి మన స్వాతంత్ర్య సంభరం.. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులు వేద్దామని ప్రతి పౌరుడు దేశాన్ని, మన చట్టాన్ని, సాంప్రదాయాన్ని గౌరవించాలని ప్రజలందరితో స్నేహపూర్వకంగా జీవితం గడపాలని దేశద్రోహులకు, అరాచక శక్తులకు తప్పుడు విధానాలు అవలంబించే వారి పట్ల సింహ స్వప్నంలా ఉంటానని ప్రజలందరూ ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలని దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జగన్ నాయక్, కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, ముబీన్, భాస్కర్, విజయ్ కుమార్, మాజీద్, రవికుమార్, హోంగార్డు దశరథ, లక్ష్మణ్, సైదమ్మ, కొండమల్లేపల్లి ప్రెస్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దస్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమన్ రెడ్డి, ఎంపీటీసీ రాజు రాణి, కొండమల్లేపల్లి మండల విలేకరులు డాక్టర్ ఏరుకొండ రాము, సయ్యద్ పాషా, బూడిద శ్రీనివాస్ యాదవ్, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, ముత్యాలు, ఖాజా మొహినుద్దీన్, బివిటి మరియు శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు