డోర్నకల్ జనవరి 26 జనం సాక్షి
డోర్నకల్ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పురపాలక కార్యాలయం నందు 74వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్,పుర చైర్మన్ వాంకుడోత్ వీరన్న,గాంధీ బొమ్మ కూడలిలో పుర వైస్ చైర్మన్ కోటిలింగం,మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బాలు నాయక్,తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో స్వాతి బిందు,ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ వేణుగోపాల్,కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపల్ మున్ని,ఎస్సీ ఎస్టీ వసతి గృహంలో వార్డెన్లు వీరన్న,శంకర్,వ్యవసాయ కార్యాలయంలో కర్ణ,డిసిసి బ్యాంక్ ఆవరణంలో మేనేజర్ అయూబ్,సుభాష్ స్ట్రీట్ వీధిలో మాతంగి జనార్ధన్,రాము,తెల్లబండ తండా గుగులోతు శ్రీనివాస్ నాయక్,అమ్మపాలెం గ్రామంలో సర్పంచ్ రాంబాయి శంకర్,బొడ్రాయి తండా సర్పంచ్ గమ్మి రాజు నాయక్,చాపల తండా పాండు నాయక్,చిలుకోడు వెంకట బాబు,వెన్నారం బోయినపల్లి వెంకన్న,తోడేళ్లగూడెం అంజయ్య,హుణ్య తండా సర్పంచ్ దేవి శంకర్ లు జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు.ప్రజలందరికీ 74 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటుపడాలన్నారు.స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం,అహింస,శాంతి, సంఘీభావం,సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు.కార్యక్రమంలో ఎంపీడీవో అపర్ణ,వార్డ్ కౌన్సిలర్లు,కో ఆప్షన్లు,నాయకులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




