కొండమల్లేపల్లి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై నారాయణరెడ్డి
కొండమల్లేపల్లి డిసెంబర్ 31 జనం సాక్షి న్యూస్: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శనివారం నాడు ఎస్సై నారాయణరెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి ర్యాలీలకు, DJ లకు అనుమతి లేదు మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, సౌండ్ బాక్సులతో నృత్యాలు చేసినా, చట్టరీత్యా చర్యలు తీసుకోనబడును. ప్రజలెవరు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్లపైకి రాకూడదు రాత్రి 10:00 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు స్పెషల్ డ్రైవ్ కేసులు చేయబడును. కావున మద్యం మత్తులో ఎవరైనా వాహనాలు నడిపితే వారిని అదుపులోకి తీసుకుని,చలనా విధించడంతోపాటు వాహనం సీజ్ చేసి లైసెన్సు రద్దు చేయబడును.కనుక తగిన జాగ్రత్తలు పాటించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంతత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు పట్టణంలోని పలు వ్యాపారస్తులు, రెస్టారెంట్లు, హోటల్లు, బేకరీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోళ్లు చేసే వినియోగదారులకు ఇవ్వాలని ఎవరైనా ధరలు అధిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పాదాచారులకు, సామాన్య ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని తెలిపారు ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే కొండమల్లేపల్లి పోలీసు శాఖను సంప్రదించాలని కోరారు
కొండమల్లేపల్లి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్సై నారాయణరెడ్డి




