కొండమల్లేపల్లి బీసీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం అమలు తీరు పరిశీలించిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి నవంబర్ 21 జనం సాక్షి న్యూస్:
మండల కేంద్రంలో సోమవారం నాడు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి అకస్మాత్తుగా బీసీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం ఆహార పదార్థాలను పరిశీలించారు బీసీ గురుకుల పాఠశాల అంతా కలియతిరిగి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులను అడిగి మీ ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను మంచిగా బోధిస్తున్నారని విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు అడిగారు బాగా చదువుకొని భవిష్యత్తులో పైకి రావాలని విద్యార్థులకు సూచించారు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు మధ్యాహ్న భోజనం పరిశీలించి పిల్లలకు రుచికరమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులు మంచి విద్యను పిల్లలకు అందించాలని చెప్పారు పాఠశాలలో విద్యార్థులకు మరియు పాఠశాల సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేవాలని మెనూ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు భోజనం అందించాలని తెలిపారు చలికాలంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పాఠశాలలోని తరగతి గదులు విద్యార్థులు విద్యార్థులు పడుకునే రూములను పరిశీలించి, విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి భోజనం నేను బాగుందని అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు,ప్రిన్సిపాల్ దాయనంద్,యువజన కాంగ్రెస్ నాయకులు మంగ్య నాయక్, పెద్దిసేట్టి మహేందర్ ,నాగేంద్ర, విద్యార్థి సంఘాల నాయకులు ఎండీ. ఖదీర్, రామవత్ సేవ నాయక్ తదితరులు పాల్గొన్నారు
కొండమల్లేపల్లి బీసీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం




