Thursday, 5 November 2026

హత్య కేసును చేదించిన మల్దకల్ పోలీసులు

హత్య కేసును చేదించిన మల్దకల్ పోలీసులు

 

మల్దకల్ నవంబర్ 21(జనంసాక్షి)మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామంలో ఈనెల19 తేదీ రాత్రి అందాజ 9:30 గంటల సమయంలో నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన ఆరెపోగు రాజు అలియాస్ సిబ్బిరాజు ను అదే గ్రామానికి చెందిన ఆరేపోగు వెంకట్ రాములు అతని తమ్ముడు ఆరెపోగు వెంకటేష్ లు హత్య చేశారని మృతుడి తల్లి ఆరెపోగు జయమ్మ మల్దకల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన మల్దకల్ ఎస్సై అర్. శేఖర్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో గద్వాల సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మల్దకల్ ఎస్సై శేఖర్, సిబ్బంది నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకొనివిచారించగా మృతుడు ఆరెపోగు రాజుకు ఆరెపోగు వెంకట రాములు భార్యతో అక్రమ సంబంధం ఉన్నదని అదే రోజు రాత్రి 9 నుండి 9:30 గంటల మధ్యలో చర్చిలో మీటింగ్ ముగించుకొని ఆరెపోగు వెంకటరాములు తన ఇంటికి వెళ్లగా అదే సమయంలో వారి ఇంటి పక్కల ఉన్న బాత్రూంలో వెంకట్ రాములు భార్య మృతుడు రాజు ఉండడం చూసి బాత్రూం బయట వైపున గడియ పెట్టి తన ఇంటిలో నుండి గొడ్డలి తీసుకుని వారి ఇంటి పక్కనే ఉన్న తమ్ముడు ఆరెపోగు వెంకటేష్ కు ఫోను చేసి విషయం చెప్పగా వెంకటేశు కొడవలి తీసుకొని వచ్చాడని ఈ ఇద్దరూ కలిసి బాత్రూంను తెరిచి వెంకట్ రాములు భార్యను బయటికి పంపి బాత్రూం లోపల ఉన్న మృతుడు ఆరెపోగు రాజు పై వెంకట్ రాములు గొడ్డలితోను వెంకటేష్ కొడవలితోను మృతుడి యొక్క మొఖం పైన మరియు తల పైన పలుమార్లు దాడి చేసి నరుకగా మృతుడు తీవ్ర రక్త గాయాలయి చనిపోవడం జరిగిందని నిందితులు తమ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. నిందితుల నుండి నేరంలో ఉపయోగించిన పదునైన ఆయుధాలు గొడ్డలి, కొడవలిని స్వాధీనం చేసుకుని సోమవారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి రిమాండ్ కు తరలించినట్లు మల్డకల్ ఎస్సై శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.