Thursday, 5 November 2026

కొండమల్లేపల్లి మండలంలో ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి ఆవిర్భావ దినోత్సవం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్ పాషా

కొండమల్లేపల్లి మండలంలో ఘనంగా ఎన్ హెచ్ ఆర్ సి ఆవిర్భావ దినోత్సవం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్ పాషా
కొండమల్లేపల్లి డిసెంబర్ 10 జనం సాక్షి న్యూస్ :

దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి అందే ప్రతి హక్కును పొందే అటువంటి అవకాశం ఉన్నదని ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్ పాషా అన్నారు.ఎన్ హెచ్ ఆర్ సి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కొండమల్లేపల్లి లో శనివారం కార్యాలయంలో కేక్ కోసి బైక్ ర్యాలీ తీసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాలలో ఎనర్సి సభ్యులు నియమించినట్లు ఆయన తెలిపారు ఎన్ఎస్ఆర్సిని నియోజకవర్గం ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఎన్హెచ్ఆర్సి ప్రజలకు మరింత దగ్గరవుతుందని ఆయన తెలిపారు నూతనంగా సభ్యులు చేరడంతో వారికి నియమక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు పెద్ది శెట్టి సత్యనారాయణ లీగల్ జున్ని దయ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గంజి యాదమ్మ నరేష్ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ తుకారం నియోజకవర్గం నాయకులు తడకమళ్ళ బిక్షమయ్య ఆల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.