సామాజిక ఉద్యమకారులు వేమూరికి గౌరవ డాక్టరేట్
మునగాల, డిసెంబర్ 10(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు ఆసియా వేదిక కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ కోఆర్డినేటర్, స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీఓ ఫౌండర్, చైర్మన్ గౌరవ లయన్ డాక్టరు ఆకుల రమేష్ లు ఒక ప్రకటనలో తెలిపారు. వేమూరి సత్యనారాయణ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి గత పదిహేను ఏళ్ళుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి క్రీడా సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఎన్నో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేస్తూ ఎన్నో సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకొని శ్రీకోదండ రామస్వామి సేవా సమితి ద్వారా ఎంతో మంది వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు వస్త్రదాన కార్యక్రమం ద్వారా అందించడం, కరోనాలాంటి విపత్కర సమయంలో కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, అన్యాకాంతం అవుతున్న దేవాలయ భూములను కాపాడటం కోసం కృషి చేయడం, నేషనల్ హైవే 65 జిఎంఆర్ సంస్థ నిర్వాహకం వల్ల ఎందరో ప్రాణాలను కోల్పోతున్న వైనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోయి పోరాటం చేయడం రోడ్డు ప్రమాదాల బాధితులకు ఆర్థిక సహాయాన్ని కల్పించడం కోసం తదితర న్యాయస్థానాలను ఆశ్రయించడం మెడికల్ మాఫియా ఆగడాలపై సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేయడం.. ఇలా ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ వివిధ రకాలుగా సేవలు అందించడం నిరుద్యోగ యువతకు అవసరమైన స్టడీ మెటీరియల్ బుక్స్ ను అందించడం.. ఇలా తదితర సామాజిక సేవా రంగాలలో కృషి చేస్తూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాందుకు గాను స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీఓ 15వ వార్షికోత్సవ సందర్భంగా చేసే కార్యక్రమంలో భాగంగా స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీఓ ఫౌండర్, చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఈ గౌరవ డాక్టరేట్ కు వేమూరి సత్యనారాయణను నామినేట్ చేయటం జరిగింది. ఈ డాక్టరేట్ ను ఈనెల 21వ తేదీన హైదరాబాదులో అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. దీనికిగాను గౌరవ డాక్టరేట్ కన్ఫర్మేషన్ లెటర్ ను లయన్ డాక్టర్ ఆకుల రమేష్ సత్యనారాయణకు అందజేయడం జరిగింది.




