కొండమల్లేపల్లి జనవరి 25 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం నాడు తాసిల్దార్ యం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారని ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు అనంతరం కార్యాలయ సిబ్బందితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేసారు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో భారతదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని కార్యాలయ సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేసారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ కె. చంద్రశేఖర్ మరియు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
కొండమల్లేపల్లి మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం తాసిల్దార్ మహేందర్ రెడ్డి




