Saturday, 7 November 2026

కొండమల్లేపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు

కొండమల్లేపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 22 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గురువారం నాడు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేసి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ మిషన్ భగీరథ ద్వార ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి అని కొండమల్లెపల్లి మండలం గన్యానాయక్ తండాలో రూ.20లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమం భాగంగా కొండమల్లెపల్లి మండలం గన్యానాయక్ తండాలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని దేవరకొండ శాసన సభ్యులు, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గారు అన్నారు.గురువారం నాడు మన ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమంలో భాగంగా కొండమల్లెపల్లి మండలం గన్యానాయక్ తండాలో రూ.20లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా తాండలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చింది అని ఆయన తెలిపారు.గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.మిషన్ భగీరథ ద్వార ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు అందించడం జరిగింది అని ఆయన తెలిపారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా అని ఆయన అన్నారు.ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు,నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామంటూ.. ఏ పైరవీ చేయకుండానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నారని ప్రభుత్వ సంక్షేమం అని ఆయన వివరించారు.తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అని ఆయన పేర్కొన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. అంతేగాకుండా, గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని చైతన్యపర్చాలని కోరారు. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని కోరారు. పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం కల్యాలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌళికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దసృ నాయక్,బిఆర్ఎస్ జిల్లా నాయకులు అబ్బానబోయిన శ్రీను,స్థానిక సర్పంచ్ రమావత్ రాములు,మాజీ సర్పంచులు రమావత్ లాలు నాయక్,రమావత్ శ్రీను,రావుల వెంకటయ్య,రమావత్ తూలిసిరామ్,రమావత్ బీమ్ సింగ్,బోడ్డుపల్లి కృష్ణ,భద్రు నాయక్ ముడవత్ పాండు నాయక్ వెంకటేష్, విరస్వామి,జాగృ,ఎంపీడీఓ బాలురాజ్ రెడ్డి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.