గణితం పట్ల ఆశక్తిని పెంచుకోవాలి..
నెరడిగొండడిసెంబర్22(జనంసాక్షి):గణితం కింగ్ ఆఫ్ అల్ సబ్జెక్టుగా గుర్తింపు ఉందని అందుచేత నిత్యం నేటి యువతకు ప్రేరణకావాలని హెచ్ ఎం అన్నారు. గురువారం మండలంలోని లఖంపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదిన్నాని పురస్కరించుకుని గణిత ఉపాద్యాయులకు సన్మానించారు.జాతీయ గణిత దినోత్సవాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి సాంస్కృతిక గణిత కృత్యాలతో ఘనంగా జరుపుకున్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్ర పితామహుడుగా ఖ్యాతిగడించిన మహా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని కొనియాడారు.పాఠశాలల్లో విద్యార్థులకు సాంస్కృతిక క్వీజ్ ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
గణితం పట్ల ఆశక్తిని పెంచుకోవాలి..




