నిర్మల్ చౌరస్తాలో ఏబీవీపీ మహాధర్నా…
– గంటపాటు నిలిచిన రాకపోకలు…
భైంసా రూరల్ డిసెంబర్ 22 జనం సాక్షి
– ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు…
బైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ప్రధాన నాలుగు కుడళ్ళ గుండా విద్యార్థులు, విద్యార్థినీలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంటపాటు ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న 2200 కోట్ల ఫీజ్ రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ లను విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ గురించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, 300 నూతన గురుకుల భవనాలను నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని, పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు పెంచి మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు,నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గంటపాటు సాగిన ఈ రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగ0లోకి దిగి, ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకొని ధర్నాలో పాల్గొన్న విద్యార్థులను ధర్నా నుండీ పంపించే ప్రయత్నం చేశారు.




