Friday, 6 November 2026

కొండమల్లేపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు

కొండమల్లేపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్
కొండమల్లేపల్లి డిసెంబర్ 28 జనం సాక్షి న్యూస్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం కొండమల్లెపల్లి మండలం చిన్నఆడిశర్లపల్లి గ్రామానికి చెందిన 60మంది ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.బిఆర్ఎస్ లో చేరిన నాయకులను కార్యకర్తలకు గులాబీ కండువాలను కప్పి రవీంద్ర కుమార్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….పేదల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.రైతులకు నిరంతరం కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.నియోజకవర్గంలో లక్ష 60వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం అని ఆయన తెలిపారు.రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని ఆయన అన్నారు.ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేస్తున్నామని అన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నదని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం,డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. గ్రామాల్లో గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళ తో దర్శనమిస్తున్నాయని అన్నారు. అనేక గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదని అన్నారు. ప్రతీ పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. గ్రామాల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. దశాబ్దాల భూవివాధాలను తెరదించి భూయజమానులకు హక్కులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ధరణీ పోర్టల్ ను రూపొందించిందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్ధిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు.దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ,
నిబద్ధతతో దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్, జడ్పీటీసీ పసునూరు సరస్వతమ్మ ,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దసృ నాయక్,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, మారం రవీందర్ రెడ్డి, దొనియాల మాజీ సర్పంచ్ అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్, రావుల వెంకటయ్య యాదవ్ ,రావుల సత్యనారాయణ యాదవ్, వస్కుల కృష్ణ,మాజీ ఎంపీటీసీలు ముడవత్ పాండు,వెంకటేశ్వర్లు,కృష్ణయ్య,గడ్డం గోవింద్,శంకర్ నాయక్,తదితరులు పాల్గొన్నారు