పోస్టాఫీస్ లో సెల్ఫీ పాయింట్.
ఫొటో : ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్.
బెల్లంపల్లి, డిసెంబర్ 28, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని పోస్టాఫీస్ లో బుధవారం నేషనల్ ఫిలటాలిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. తపాలా శాఖ, ఫిలటాలిక్ ఆఫ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు ఢిల్లీ లోని ప్రగతి మైదానంలో జాతీయ ఫిలటాలిక్ ప్రదర్శన నిర్వహించనుంది. ఇందులో భాగంగా తపాలా కార్యాలయం ముందు సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసినట్లు తపాలా అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ కు వచ్చిన ప్రజలు సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీలు దిగారు.
పోస్టాఫీస్ లో సెల్ఫీ పాయింట్.




