Friday, 6 November 2026

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

-కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

 

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ సూపర్ బజార్ చౌరస్తా లోని కాంగ్రెస్ పార్టీ, ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో 138వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా టి పి సి సి ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, ఐ ఎన్ టి యు సి సీనియర్ నాయకులు తేజావత్ రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు కొనియాడారు. దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని, ఎందరో నేతలు ప్రాణత్యాగం చేశారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి చెందిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొట్టే రాజయ్య, దేవేందర్ రెడ్డి, రామకృష్ణ ,భూమేష్, లాడెన్ రవి తదితరులు పాల్గొన్నారు.