బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ఆడేపు రవీందర్.
10 హెచ్ పి.ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి.
వస్త్ర పరిశ్రమ మనుగడ కాపాడే దిశగా ఆలోచించాలి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 19. (జనంసాక్షి). రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో తయారు చేపిస్తున్న బతుకమ్మ చీరలను కాటాన్ నూలుతో తయారు చేయించాలని బిజెపి కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్, సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 నుండి రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బతుకమ్మ చీరల ఆర్డర్ ను ఇస్తూ వస్తుందని అన్నారు. ఏటా 330 కోట్లతో ఆర్డర్ ఇస్తున్న వస్త్ర పరిశ్రమ మనుగడ సాగించాలేని పరిస్థితులకు కారణం అవుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95% మహిళలు పాలిస్టర్ చీరలు వాడడం లేదని గుర్తు చేశారు. ఇప్పటికే చిన్న మధ్య తరహా మరమగ్గాల ఉత్పత్తిదారులు 6000 పైగా మగ్గాలు తూకానికి అమ్మేసుకోవడము ఇతర రంగాలకు వెళ్లిపోవడం జరిగిందని అన్నారు. పాలిస్టర్ వల్ల కొద్దిమంది కి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని పాలిస్టర్ స్థానంలో కాటన్ నులు ద్వారా బతుకమ్మ చీరలు తయారు చేయించగలిగితే పరిశ్రమకు పూర్వవైభవం రావడమే కాక డైయింగ్ ,సైజింగ్, అనుబంధ పరిశ్రమలు అందరికీ ఉపాధి దొరుకుతుందని తెలిపారు. వస్త్ర పరిశ్రమకు 10 హెచ్ పీ. ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని అన్నారు. దళిత బంధు తరహాలో నేతన్న లకు పద్మశాలి బందు అమలు చేయడం వల్ల సొంతంగా నూలు కొనుగోలు చేసే వీలు ఉంటుందని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. రాజకీయాల కోసం కాకుండా పరిశ్రమ ప్రయోజనాల కోసం ఆలోచించాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో చేనేత సెల్ జిల్లా కన్వీనర్ నాగుల శ్రీనివాస్, గాజుల సదానందం తదితరులు పాల్గొన్నారు.




