కొండమల్లేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో అలరించిన టిఎల్ఎం మేళా కొండమల్లేపల్లి జనవరి 3 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండలములో మండల స్థాయిలో టీచర్ లెర్నింగ్ మెటీరియల్స్ (TLM)మేళా స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొండ మల్లేపల్లి నందు ఏర్పాటు చేయడం ఇట్టి TLM మేళాను మండల విద్యాశాఖాధికారి ఎ.మాతృ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బోధనోపకరణాల మేళ అట్టహాసంగా కొనసాగిందని కొండమల్లేపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నాడు మండల స్థాయి ఉపాధ్యాయ విద్యార్థుల అభ్యసన సామర్థ్య మేళా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సామాజిక అంశాలు, సౌర కుటుంబ వ్యవస్థ, నివాసాలు, పండుగల ప్రత్యేకతల నమూనాలు, సహజ వనరుల వంటి అంశాలను ప్రదర్శిస్తూ ఉపాధ్యాయులతో కలిసి వివరించారు ముఖ్య అతిధులుగా కొండమల్లేపల్లి మండల యం.పి.పి.రేఖ శ్రీధర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు కార్యక్రమములో,యం.పి.డి. ఓ బాలరాజు రెడ్డి మండల ఎఫ్.ఎల్. యన్.నొడల్ అధికారి యం.సత్యనారాయణ, కాంప్లెక్స్ నోడల్ అధికారి పి.శోభారాణి, ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులు,ఉపాద్యాయులు టి.ఎల్.యం.మేళాలో సబ్జెక్ట్ వారీగా తెలుగు, ఆంగ్లము,గణితం ఇవిఎస్.లలో మండల పరిధిలోని పి.ఎస్.& యు.పిఎస్.పాఠశాలల ఉపాద్యాయులు అందరూ పాల్గొని వారు తయారు చేసిన టి.ఎల్.యంను న్యాయ నిర్ణేతలు గా ఎఫ్.ఎల్. యన్.అర్పిలు వాసికర్ల రమేష్, శశిధర్ మాణిక్యం, శ్రీరాములు పరిశీలన చేసిన తదుపరి ఇట్టి టి.ఎల్.యం. విద్యార్థులకు బోధన ప్రక్రియలో ఉపయోగపడే టి.ఎల్.యం ల ప్రదర్శనలో ప్రదర్శించడం జరిగింది,ఈ మండల స్థాయి టి.ఎల్.యం కార్యక్రమములో పాల్గొన్న అందరికీ ప్రత్యేక పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్, జిల్లా స్థాయికి ఏంపికాబడిన ఉపాద్యాయులకి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది,ఇట్టి మండల స్థాయి టి.ఎల్.యం.మేళాలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు
కొండమల్లేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో అలరించిన టిఎల్ఎం మేళా




