Tuesday, 3 November 2026

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి.

మర్పల్లి జనవరి02 (జనం సాక్షి)

సావిత్రిబాయి పూలే ప్రముఖ సంఘసంస్కర్త జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు అని బహుజన సమాజ్ పార్టీ వికారాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు తలారి రాజు అన్నారు. మంగళవారం రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహము వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు.
ఈ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ
గొప్ప మానవతావాది మొట్టమొదటిసారి భారతదేశంలో పాఠశాల స్థాపించిన మహిళా ఉపాధ్యాయురాలు అన్నారు. ఈమె చేసిన సేవలు మరువలేని అని గుర్తు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ మర్పల్లి మండల అధ్యక్షులు పర్వేద శ్రీనివాస్ మాట్లాడుతూ అన గారిన జీవితాల్లో అక్షరమనే, ఆయుధాన్ని నింపిన గొప్ప సంఘసంస్కర్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు తలారి రాజు, వికారాబాద్ మహిళా కన్వీనర్ రంజోల్ నర్సమ్మ, మర్పల్లి మండల అధ్యక్షులు పర్వేద శ్రీనివాస్, మండల మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అమీర్, మండల ప్రధాన కార్యదర్శి కావలి ప్రభాకర్, ప్రేమ్ కుమార్. శ్రీకాంత్, మోహన్, కోటేశ్వరరావు, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.