కొండమల్లేపల్లి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి
కొండమల్లేపల్లి జనవరి.01.2023 జనం సాక్షి న్యూస్: కొండమల్లేపల్లి మండల ప్రజలందరు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని మండలంలో ప్రజలందరూ కలిసి మెలిసి గౌరవంగా, ఇతరుల పట్ల ప్రేమతో జీవితం గడపాలని జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి తెలిపారు కొండమల్లేపల్లి మండలం అభివృద్ధి,సంక్షేమం కొత్త సంవత్సరంలో మరింత వేగవంతం కావాలని ఆకాంక్షిస్తూ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు సత్పలితాలనిస్తున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో దేశం గర్వించే గొప్ప సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ప్రజలంతా మరింత బాగుండాలని ఆకాంక్షించారు.
యావత్ తెలంగాణా సమాజం సుభిక్షంగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు.
కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు.ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, వాటిని చేరుకునేలా ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని పసునూరు యుగేందర్ రెడ్డి కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏర్పరుచుకున్న లక్ష్యాలను వచ్చే ఏడాది నాటికి చేరుకునేలా శ్రమించాలని కోరుకున్నారు. 2022 వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ,2023 లోకి అడుగుపెడుతున్న వేళ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరోసారి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కొండమల్లేపల్లి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు




