కొండమల్లేపల్లి సమస్త ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్ కొండమల్లేపల్లి జనవరి 1 2023 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి గ్రామ మరియు మండల ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకు,రైతు సోదరులకు, యువతకు, పట్టణ వ్యాపారస్తులకు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతాన్ని సమీక్షించుకుంటూ,వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని తెలిపారు.నూతన సంవత్సరం (2023) సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధనకై ముందుకు సాగాలన్నారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతులవుతారని పునరుద్ఘాటించారు. ఎన్నో అవాంతరాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కుంటూ నేడు భారత దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శమని కుంభం శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అనతికాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్ గా మారిందని తెలిపారు. 2023 నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని, దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలకు, పాలనకు నాందిగా నూతన సంవత్సరం నిలవాలని కోరుకున్నారు. 2023 సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
కొండమల్లేపల్లి సమస్త ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్




