Monday, 2 November 2026

కొయ్యడి గంగయ్య వృక్ష మిత్రుడు.

కొయ్యడి గంగయ్య వృక్ష మిత్రుడు.
నెరడిగొండజనవరి1(జనంసాక్షి):మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.
మండలంలోని కుఫ్టీ గ్రామానికి చెందిన సామాజిక సేవకు కొయ్యడి గంగయ్య కేటీఆర్ పార్క్ లో ఆదివారం రోజున ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ లు హాజరయ్యారు.కెటిఆర్ వనంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుటకు పర్యావరణానికి కాపాడుటకు సమస్త మానవాళికి జీవనాధారమైన చెట్లను ప్రతి ఒక్కరూ నాటి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవాలని,సామాజిక సేవకుడైన కొయ్యడి గంగయ్య వృక్షాలకు కాపాడే మిత్రుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీపీ తోపాటు గ్రామ సర్పంచ్ రాజు యాదవ్ కవి గడ్డం భీంరెడ్డి మాజీ పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్ కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్ నాయకులు శివారెడ్డి దావుల బోజన్న కిరణ్ కుమార్ రెడ్డి చంద్ర శేఖర్ భీంరావు కొయ్యడి గంగయ్య నవీన్ లింబాజి అంబరావు కరణ్ సింగ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.