Thursday, 5 November 2026

కొండమల్లేపల్లి మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

కొండమల్లేపల్లి మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మండల సర్పంచుల పోరం అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ కొండమల్లేపల్లి జనవరి 14 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానీకానికి రైతు సోదరులకు ప్రజా ప్రతినిధులకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రైతు సోదరులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు మరియు మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొల్పామన్నారు.తెలంగాణ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలెదురైనా సమర్థవంతంగా ఎదుర్కుంటామని, రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలని కోరారు