బిల్లుడు తండాలో ముగ్గుల పోటీ
టేకులపల్లి,జనవరి 14( జనం సాక్షి): టేకులపల్లి మండలం బిల్లుడు తండా గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ గలక ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు దిశ కమిటీ జిల్లా సభ్యులు, మద్రాస్ తండా సర్పంచ్ మాలోత్ రాజేందర్ నాయక్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలాంటి సాంప్రదాయ, సంస్కృతిని పల్లెల్లో ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తూ ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు అని అన్నారు. ఇలాంటి సాంప్రదాయాన్ని స్థానిక సర్పంచ్ ఆడపడుచులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. ముగ్గుల పోటీ లో పాల్గొన్న వారికి ఫస్ట్ ప్రైజ్ స్థానిక సర్పంచ్ అజ్మీర గలక చేతుల మీదుగా అందించారు. రెండవ బహుమతి గ్రామ పెద్దలు మంగ్యా నాయక్,అలాగే మూడవ బహుమతి రాజేందర్ నాయక్,నాలుగో బహుమతి బానోతు శ్రీరామ్ అందించారు.




