కొండమల్లేపల్లి జనవరి 23 (జనంసాక్షి ) న్యూస్ : బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఆదేశాల మేరకు బీసీ పొలిటికల్ యువజన జేఏసీ, కొండమల్లేపల్లి మండల అధ్యక్షునిగా కలగోని.రమేష్ గౌడ్ ఉపాధ్యక్షుడిగా బొడ్డుపల్లి. ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా కుందారపు సాయన్న యాదవ్ కోశాధికారిగా కొండమీది మల్లేష్ నియామకం అయ్యారు కొండమల్లేపల్లి బీసీ సంఘం కార్యాలయంలో బీసీ పొలిటికల్ యువజన జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీ పొలిటికల్ యువజన జేఏసీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ యువజన. జేఏసీ దేవరకొండ నియోజకవర్గం నాయకులు తోటపల్లి మల్లేష్ ,కొప్పోలు శివ కుమార్, బొడ్డుపల్లీ రామకృష్ణ ,అంజి చారి తదితరులు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి మండల బీసీ యువజన నూతన కార్యవర్గం




