కొండమల్లేపల్లి మండల స్థాయి బోధనభ్యసన సామగ్రి టిఎల్ఎం మేళాను ప్రారంభించి, సందర్శించిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి
కొండమల్లేపల్లి జనవరి 3 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మండల స్థాయి బోధనభ్యసన సామగ్రి (TLM) మేళాను ప్రారంభించి, సందర్శించిన కొండ మల్లేపల్లి మండల ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి తదనంతరం మొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విదంగా PRTUTS, TS UTF ఉపాధ్యాయ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి (MEO) మాతృ నాయక్ , MPDO బాలరాజు రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు వసీకర్ల రమేష్, శ్రీరాములు, మంగ్య నాయక్, నాగేంద్ర బాబు, కార్తిక్, విద్యార్థి సంఘం నాయకులు యం.డి. ఖదీర్ మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి మండల స్థాయి బోధనభ్యసన సామగ్రి టిఎల్ఎం మేళాను ప్రారంభించి, సందర్శించిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి




