బి.సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు ఆదేశాలతో మందమర్రి పట్టణ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొండిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి మనోవికాస్ పాఠశాల యందు శ్రీమతి సావిత్రి భాయి పూలే 192 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా బి.సి సంక్షేమ సంఘం కార్యాలయంలో సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం మనోవికాస్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో కేక్ కట్ చేపించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సురేఖ ను శాలువాతో సన్మానించి పండ్లు,కేక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కొండిల్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి వాల్మీకి, ప్రధాన కార్యదర్శి రాయబారపు కిరణ్ లు మాట్లాడుతూ మహిళల వెనుకబాటు తనానికి చదువే కారణమని తెలుసుకున్న సావిత్రి భాయి పూలే విద్యతోనే మహిళ లోకానికి విముక్తి అని విద్య, విజ్ఞానం, స్వేచ్చ,స్వతంత్రాలను స్త్రీ జాతికి ప్రసాదించి అసమానతలు లేని సమాజం నిర్మాణంకోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే అని అన్నారు.భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందని తెలిపారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రి భాయి పూలే అని కొనియాడారు.అలాగే1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించిందని ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చక పోవడంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు సైతం పూనుకున్న మొక్కవోని ధైర్యంతో బాలికలకు విద్యను అందించిన గొప్ప ఉపాద్యాయురాలు ఆమే ఆత్మ విశ్వాసం, ధైర్యాన్ని నేటి మహిళలు స్పూర్తి గా తీసుకోవాలని తెలిపారు.సత్యశోధక్ సమాజ్’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి వితంతువులకు వివాహాలు జరిపించిందని ఎన్నో రకాల సాంఘిక దురాచారాలను తరిమి కొట్టిందని అన్నారు.ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిజాయితీగా నిస్వార్థ సేవలతో అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సాహస వీర నారీమణి సావిత్రి భాయి పూలే ఆమే జీవితం నేటి మహిళా లోకానికి స్ఫూర్తి దాయకమని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ బి.సి సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు బత్తుల సతీష్ బాబు, కార్యదర్శులు జమాల్ పూరి నర్సోజీ, మహారాజు సంపత్,కటుకోజ్వల వేణు, రెడ్డి రాకేష్,ప్రచార కార్యదర్శులు వేముల శ్రీనివాస్, మడ్డి వేణుగోపాల్ గౌడ్,ఎండి హుస్సేన్, సోషల్ మీడియా ఇన్చార్జిలు ఎండి జమాల్, ఆడెపు సత్యనారాయణ, మీడియా ప్రతినిధి శ్రీరామోజు సంతోష్ చారి, జిల్లా నాయకులు దానపెల్లి తిరుపతి, ఎండి పాషా,మాయ రమేష్,తౌటం శ్రీనివాస్, దానపెల్లి సత్యం,రాయబారపు జనార్థన్, కార్యవర్గ సభ్యులు దేవరపల్లి ప్రభాకర్, పోలు సంపత్,ఎండ ఖలీం, డాక్టర్ సత్యం, సముద్రాల శ్రీనివాస్, పిట్టల కుమార్,జంజిరాల రాజు,శివ తదితరులు పాల్గొన్నారు……..జనం సాక్షి




