Friday, 6 November 2026

కొండమల్లేపల్లి సంస్కృతి స్కూల్ లో ఘనంగా ప్రపంచ బాలల హక్కుల దినోత్సవ వేడుకలు

కొండమల్లేపల్లి సంస్కృతి స్కూల్ లో ఘనంగా ప్రపంచ బాలల హక్కుల దినోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి కొండమల్లేపల్లి నవంబర్ 20 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలోని సంస్కృతి స్కూల్ లో ఆదివారం నాడు ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. బాలల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించి, పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది. పిల్లలు తమ సొంత జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై భావాలను, ఉద్దేశాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను, సంఘాలలో చేరడానికి శాంతియుతంగా సమావేశం కావడం హక్కులుగా కల్పింపబడ్డాయి బాలల హక్కుల కనె్వన్షన్ ప్రభావం బాలల హక్కులపై కనె్వన్షన్ అంతర్జాతీయ మానవ హక్కుల శాసనంలో ఒక మైలురాయిని దాటింది. బాలల హక్కులపై కనె్వన్షన్ ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చూడానికి, పిల్లల హక్కుల పరిరక్షణలో, పిల్లల సమగ్ర అభివృద్ధి విస్తృతమైన చర్యలను చేపడుతుంది. భారతదేశ ప్రభుత్వం భారతదేశంలో బాలలను కాపాడటం, బాలల ఎదుగుదలకు ప్రోత్సహించడం, పిల్లల హక్కులు రక్షించడానికి 2007 మార్చి నెలలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ నేషనల్ కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థను ఏర్పాటుచేయడం జరిగింది. చైల్డ్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వ విభాగాలు, డ్వాక్రా గ్రూపులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించడం జరుగుతుంది. బాలల హక్కుల ప్రకారం పిల్లల శారీరక మరియు మానసిక అనారోగ్యంలో పిల్లల రక్షణ, సంరక్షణ మరియు చట్టపరమైన రక్షణ చాలా అవసరం. బాలల హక్కులకు రక్షించడానికి టోల్‌ఫ్రీ నెంబరు 1098ను ఏర్పాటుచేయడం జరిగింది.బాలల హక్కుల లక్ష్యాలు…పిల్లలను ఒక వ్యక్తిగా గుర్తించాలి. వారిని అర్థం చేసుకోవడానికి, వారి అవసరాలను అంచనా వేయడం, మానవ హక్కులన్నీ పిల్లలకు కూడా వర్తింపజేయడం, పిల్లలు సమాజంలో ప్రత్యేక గౌరవం పొందడానికి, వారి భద్రతను కాపాడటానికి, బాలల హక్కుల చట్టాలపట్ల చైతన్యం కలిగించడం, పిల్లలలో సృజనాత్మకతను వెలికితీయడం, పిల్లలలో జీవితంపట్ల భరోసాను కల్పించడం, సామాజికంగా ఎదుగుదలకు తోడ్పడటం, బాలల హక్కుల రక్షణ అమలు తీరును సమీక్షించుకోవడం, పిల్లలకు 18 సంవత్సరాలు నిండేంతవరకు పిల్లలపట్ల తల్లిదండ్రుల బాధ్యతపై చైతన్యం కలిగించడం, లైంగిక దాడులు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యతను గుర్తించినట్లుగా చైతన్యం కలిగించడం, బాలలపై హింసాకాండను తగ్గించడం లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని బాలల హక్కుల దినోత్సవ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది.
భారతదేశంలో పిల్లల హక్కుల పరిరక్షణ
ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల పరిరక్షణలో కొంతమేరకు పురోగతి సాధించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముఖ్యంగా భారతదేశం పిల్లల హక్కులను గుర్తించడంలో కొంతమేరకు వెనుకబడి ఉందని చెప్పవచ్చు. పోక్సో చట్టం, నిర్భయ చట్టం, ఉచిత నిర్బంధ విద్య హక్కుల చట్టం, బాల కార్మిక నిర్మూలన చట్టం. ఇలా చట్టాలు చేసినప్పటికీ వాటి అమలుకు పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోతోంది పిల్లల తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో విద్యాభ్యాసాన్ని మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంస్కృతి స్కూల్ యాజమాన్యం అధ్యాపక బృందం విద్యార్థినీ విద్యార్థులు పేరెంట్స్ బృందం తదితరులు పాల్గొన్నారు