Friday, 6 November 2026

దేశంలో రాజ్యాంగ విలువలను దెబ్బతీసే విధంగా నూతన విద్యా విధానం

దేశంలో రాజ్యాంగ విలువలను దెబ్బతీసే విధంగా నూతన విద్యా విధానం.
*ఫోటో రైట్ అప్… సమావేశంలో TS UTF వనపర్తి జిల్లా కార్యదర్శి రవిప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ
_వనపర్తి టౌన్ :నవంబర్ 20 ( జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి యుటిఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి రవి ప్రసాద్ గౌడ్ గారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా సంస్కరణల పేరుతో విద్యారంగంలో తీసుకు వస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా,నూతన విద్యా విధానం 2020 మార్పు చేస్తూ చేసిన తీరు విద్యారంగంలో రాజ్యాంగ విలువలను దెబ్బతీసే విధంగా, ఉందని,ఉన్నత విద్యను పూర్తిగా బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఉందని,పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ఉన్న ఈ పాలసీని వెనక్కి తీసుకోవాలని,దేశంలో విద్యను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై,విద్యార్థి సంఘాలపై ఉందని అన్నారు. దేశంలో ప్రైవేటు యూనివర్సిటీలలో పేద విద్యార్థులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల చావులకు ఈ ప్రభుత్వాలు కారణమవుతున్నాయని,విద్యాఉపాధి అవకాశాల కోసం విద్యార్థులు పోరాటాలు ఉద్రిక్తం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.ఆది,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి,సహాయ కార్యదర్శి రాఘవ,జిల్లా కమిటీ సభ్యులు కుమార్,నాయుడు, నాయకులు, మల్లేష్,అశోక్,సాయి,శివ,అక్బర్,శ్రీకాంత్,వంశీ తదితరులు పాల్గొన్నారు.