కోరేగాం అమరవీరుల సంస్మరణ నివాళులు
రఘునాథ పాలెం జనవరి 01 జనం సాక్షి
ఖమ్మం నగరం అంబేద్కర్ సెంటర్లో మాల మహానాడు ఆధ్వర్యంలో భీమ్ కోరేగాం శౌర్య దివాసును ముప్ప మంగయ్య కాకుమాను రామారావు లింగాల రవికుమార్ రెంటాల హుస్సేన్ పేతురు గార్ల అధ్యక్ష వర్గంగా కోరేగాం అమరవీరులకు జోహార్లు మనువాదం నశించాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలని నినదించారు కామా ప్రభాకర్ కొట్టే సుధాకర్ దాసరి శ్రీనివాస్ ఎర్ర గంగాధర్ కొరివి దయానంద్ నకిరికంటి సంజీవరావు తప్పెట్ల భాస్కర్ మాట్లాడుతూ ఆధిపత్య కులాల కు అణగారిన కులాలకు మధ్య జరిగిన విరోచిత పోరాటంలో మహర్ సైనికులు విజయం సాధించారని గాదెర బాబు కుమ్మరి వీరబాబు చింతమల్ల వెంకటేశ్వర్లు దానయ్య చింతల రవి పల్లా ప్రభుదాస్ ఆర్టీసీ పుల్లయ్య తురక నాగేశ్వరరావు పప్పుల నాగేశ్వరరావు యోనా గుర్రం మనోజ్ ఎస్టీ సంఘ నాయకులు బద్రు నాయక్ శ్రీమతి ఉపేంద్ర ముస్లిం మైనార్టీ నాయకులు శ్రీమతి నజీమా శ్రీ రెహమాన్ బీసీ సంఘ నాయకులు వెంకయ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో సమిష్టి పోరాటాలు చేసి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరినారు అలాగే పే రుమలపల్లి భాస్కర్ గుంతెటి వీరభద్రం మాట్లాడుతూ ధైర్యానికి సాహసానికి తెగింపుకు మారుపేరుగా నిలిచిన బహుజన సైనికులు 28 వేల సైన్యం కలిగిన పీష్వాలను 1818లో జరిగిన యుద్ధంలో చిత్తుచిత్తుగా చీల్చి చెందాడింది 500 మంది మహర్ సైనికులేనని ఈ పోరులో ప్రక్కనే ఉన్న భీమా నదిలో రక్తం ఏరులై పారింది దాని పక్కనే కోరేగాం గ్రామం ఆ గ్రామంలో యుద్ధంలో చనిపోయిన వీర మరణం చెందిన మహర్ సైనికులు 45 మంది మహర్ సైనికులు 28 వేల పీస్వ సైన్యాన్ని ఎక్కడ చనిపోయారో ఎక్కడ దాక్కున్నారు ఎక్కడకు పారిపోయిన్రు ఇప్పటివరకు కూడా తెలిసిన దాఖలాలు లేవు ఈ శౌర్య విజయాన్ని పురస్కరించుకొని మృత వీరుల స్తూపాన్ని భీమ నది ఒడ్డున కోరేగాం గ్రామంలో నిర్మించడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న బాబా సాహెబ్ అంబేద్కర్ మృత వీరుల స్తూపం దగ్గర నుంచి మనమందరం జనవరి నూతన సంవత్సరాన్ని దివాసుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు అప్పటినుండి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున శౌర్య దివాసుగా జరుపుకుంటూ మృతవీరులను స్మరిస్తూ వారికి జోహార్లు తెలుపుతూ బాబా సాహెబ్ కలలుగన్న రాజ్యాధికారం దిశగా మన ఓటును మనమే వేసుకుని మనమే పాలకులుగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో గుమ్మడి రామకృష్ణ చింతల బాబు శేషగిరిరావు మెట్టు వెంకటేశ్వర్లు నాగటి గోపాలు తో తదితరులు పాల్గొన్నారు
కోరేగాం అమరవీరుల సంస్మరణ నివాళులు




